అలర్ట్.. జనవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు
Bank Holidays in January 2023. జనవరిలో బ్యాంకులకు 14 రోజులకు సెలవులు ఉన్నాయి
By తోట వంశీ కుమార్
మరో ఎనిమిది రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. కొత్త సంవత్సరం రానుంది. బ్యాంకులకు సుదీర్ఘ సెలవుల కారణంగా సాధారణ ఖాతాదారులు చాలాసార్లు చాలా ఇబ్బందులు పడవలసి వస్తోంది. ప్రజల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. 2023 జనవరిలో బ్యాంకులకు 14 రోజులకు సెలవులు ఉన్నాయి. వీటిలో జాతీయ సెలవులు, కొన్ని స్థానిక లేదా ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవు దినాల్లో మాత్రమే బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. కాబట్టి బ్యాంకుల్లో ఏమైన ముఖ్యమైన పనులు ఉంటే సెలవులను బట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి.
జనవరి 2023 బ్యాంక్ సెలవుల జాబితా
2023 జనవరి 1 – నూతన సంవత్సరం, ఆదివారం(దేశం మొత్తం)
2023 జనవరి 5 – గురు గోబింద్ సింగ్ జయంతి – హర్యానా, రాజస్థాన్
2023 జనవరి 8 – ఆదివారం (దేశం మొత్తం)
2023 జనవరి 11 – మిషనరీ దినోత్సవం (మిజోరంలో)
2023 జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి (పశ్చిమ బెంగాల్‌లో)
2023 జనవరి 14 – మకర సంక్రాంతి (రెండవ శనివారం)
2023 జనవరి 15 – కనుమ/ ఆదివారం(అన్ని రాష్ట్రాలకు సెలవు)
2023 జనవరి 22– ఆదివారం
2023 జనవరి 23 – నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి( త్రిపుర, పశ్చిమ బెంగాల్)
2023 జనవరి 25 – రాష్ట్ర దినోత్సవం(హిమాచల్ ప్రదేశ్)
2023 జనవరి 26 – గణతంత్ర దినోత్సవం(అన్ని రాష్ట్రాలకు సెలవు)
2023 జనవరి 28 – నాల్గవ శనివారం
2023 జనవరి 29 – ఆదివారం
2023 జనవరి 31 – మి-డాం-మి-ఫి(అస్సాం)