అలర్ట్.. జులైలో 13 రోజులు బ్యాంక్‌లు బంద్!
నేటి టెక్ యుగంలో చాలా వరకు బ్యాంక్ పనులు ఆన్‌లైన్ జరుగుతున్నాయి. అయినా కూడా చాలా మందికి బ్యాంకుకు వెళ్తారు.
By అంజి
అలర్ట్.. జులైలో 13 రోజులు బ్యాంక్‌లు బంద్!
నేటి టెక్ యుగంలో చాలా వరకు బ్యాంక్ పనులు ఆన్‌లైన్ జరుగుతున్నాయి. అయినా కూడా చాలా మందికి బ్యాంకుకు వెళ్తారు. ఆర్థిక లావా దేవీలకు సంబంధించి చాలా మంది వ్యాపారులు, ఇతరులు ఎక్కువగా బ్యాంకుల్లో పనులు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే సెలవుల గురించి తెలుసుకుని బ్యాంకులకు వెళితే సజావుగా మీ పనులను పూర్తి చేసుకోవచ్చు. అలాంటి వారి కోసం ఓ సమాచారం. వచ్చే నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులు ఉండనున్నాయ్. వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిపి ఉన్నాయి. కొన్ని డేస్‌లో ఈ సెలవులు రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి కూడా మారుతాయి. దీంతో మిగతా 18 రోజులు బ్యాంకులు పనిచేస్తాయి.
బ్యాంక్‌ల సెలవుల జాబితా
3 జులై 2025: ఖర్చీ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
5 జులై 2025: గురు హరగోబింద్ పుట్టినరోజు కారణంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
6 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు హాలిడే
12 జులై 2025: రెండో శనివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి
13 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి
14 జులై 2025: బెహ్ దింఖ్లామ్ కారణంగా ఈ రోజు షిల్లాంగ్ జోన్‌లో బ్యాంకులకు హాలిడే
16 జులై 2025: హరేలా పండుగ కారణంగా ఈ రోజు డెహ్రాడూన్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
17 జులై 2025: ఉ తిరోత్ సింగ్ వర్ధంతి కారణంగా ఈ రోజు షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
19 జులై 2025: కేర్ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు బంద్
20 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు
26 జులై 2025: నాలుగో శనివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు బంద్
27 జూలై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు హాలిడే
28 జూలై 2025: ద్రుక్పా త్సే జీ కారణంగా ఈ రోజు గ్యాంగ్‌టాక్ జోన్‌లో బ్యాంకులకు సెలవు