రేప‌టి నుంచే వ‌రుస‌గా 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు

Bank branches may be shut for next 4 days.బ్యాంకులు వ‌రుస‌గా నాలుగు రోజులు మూత‌ప‌డ‌నున్నాయి. రెండు రోజులు సెల‌వులు కాగా.. మ‌రో రెండు రోజులు స‌మ్మె కార‌ణంగా ఖ‌తాదారుల‌కు సేవ‌లు దూరం కానున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2021 4:16 PM IST
Bank branches may be shut for next 4 days

బ్యాంకుల్లో ఎమైనా ప‌ని ఉందా..? అయితే.. ఓ నాలుగు రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే బ్యాంకులు వ‌రుస‌గా నాలుగు రోజులు మూత‌ప‌డ‌నున్నాయి. రెండు రోజులు సెల‌వులు కాగా.. మ‌రో రెండు రోజులు స‌మ్మె కార‌ణంగా ఖ‌తాదారుల‌కు సేవ‌లు దూరం కానున్నాయి. మార్చి 13న రెండో శ‌నివారం, 14న ఆదివారం కావ‌డంతో ఆ రెండు రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వు. 15,16 తేదీల్లో సమ్మె కార‌ణంగా ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో సేవ‌లు నిలిచ‌పోనున్నాయి. అయితే.. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు మాత్రం య‌థాత‌థంగా ప‌నిచేయ‌నున్నాయి.

పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం ఈ నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌తో పాటు ఒక ప్ర‌భుత్వ రంగ భీమా సంస్థ‌ను ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు బ‌డ్జెట్ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు వ్య‌తిరేకించాయి. తొమ్మిది యూనియ‌న్ల‌తో కూడిన ది యునైటెడ్ ఫోర‌మ్ ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్‌(యూఎఫ్‌బీయూ) స‌మ్మె త‌ల‌పెట్టింది. ‌


Next Story