పండగ ఆఫర్.. 12 ఈఎంఐలు రద్దు
Axis Bank to waive 12 EMIs on select home loans.కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగం
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2021 12:59 PM IST
కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీవాళీ పండుగ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్.. 'దిల్ సే ఓపెన్ సెలెబ్రేషన్స్: క్యోంకి దీవాలి రోజ్ రోజ్ నహీ ఆతీ' పేరిట ఆకర్షణీ యమైన ఆపర్లను ప్రకటించింది. ఇందులో బాగంగా ఎంపిక చేసిన గృహ రుణాలపై 12 ఈఐఎంఐ(నెలవారీ వాయిదా)లను రద్దు చేయనున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చెల్లింపులపై డీల్స్, డిస్కౌంట్లు, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ద్విచక్రవాహన కస్టమర్లకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఆన్‌రోడ్ ఫైనాన్స్ అందించనుంది.
ఆపర్లు ఇవే..
- ఎంపిక చేసిన హోమ్ లోన్లపై 12 ఈఎంఐలు రద్దు
- ద్విచక్రవాహన కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఆన్-రోడ్ ఫైనాన్స్
- వ్యాపారుల కోసం టర్మ్-ఎక్విప్‌మెంట్ లోన్లు, వాణిజ్య వాహనాల ఫైనాన్స్‌పై ప్రత్యేక ప్రయోజనాలు
- యాక్సిస్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లు
- 50 నగరాల్లో 2,500 మంది ఎంపిక చేసిన స్థానిక వ్యాపారుల వద్ద చేసే చెల్లింపులపై 20 శాతం వరకు డిస్కౌంట్
- రిటైల్ లోన్ ప్రొడక్ట్స్, రెస్టారెంట్లలో బిల్లులపై రాయితీలు
- తక్కువ వార్షిక వడ్డీకే వ్యక్తిగత (10.25%), విద్య (8.99%), బంగారు (9%) రుణాలు