శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

August 9th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 2:59 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం ధ‌ర ఇప్పుడు నేల‌చూపులు చూస్తోంది. శ్రావ‌ణ మాసం ప్రారంభం కావ‌డంతో.. పెళ్లిళ్లు పెద్ద సంఖ్య‌లో జ‌ర‌గ‌నున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు బంగారం ధ‌ర త‌గ్గింది. దేశీయంగా మంగ‌ళ‌వారం బంగారం ధ‌ర రూ.450 మేర త‌గ్గింది. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా న‌డించింది. కేజీ వెండిపై రూ.1400 మేర ధర తగ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌రలు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధ‌ర‌లు ఇలా..

న్యూఢిల్లీలో కిలో వెండి రూ. 63,600 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ధర రూ. 63,600 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,700 గా ఉంది. బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 63,600లుగా కొనసాగుతుంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 63,700లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700 లుగా ఉంది. విజయవాడలోనూ వెండి ధర రూ.68,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.68,700లుగా ఉంది.

Next Story