మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

August 8th Gold Price.పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుతగ్గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 1:22 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ధర ఎంత పెరిగినా కూడా బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం ధరలు దిగి వచ్చాయి. ఆదివారం 10 గ్రాముల ధరపై రూ.750 వ‌ర‌కు త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50.180

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it