మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

August 7th Gold price.నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. పసిడి అంటే భారతీయులకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 1:49 AM GMT
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. ధర ఎంత పెరిగినా కూడా బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా శనివారం బంగారం ధరలు దిగి వచ్చాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి 300 వరకు త‌గ్గింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు :

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story