మగువలకు శుభవార్త
August 5th Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2021 1:56 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గురువారం బంగారం ధర స్థిరంగా ఉంది. అయితే.. కొన్ని చోట్ల స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,040, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,320
- ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,950
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల రూ. 45,330, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,450
- హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980
- విశాఖపట్నం, విజయవాడ ల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980
బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.