మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

August 28th Gold Price.బంగారాన్ని కొనుగోలు చేసేందుకు భార‌తీయులు మ‌క్కువ చూపిస్తుంటారు. ఎందుకంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 2:13 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారాన్ని కొనుగోలు చేసేందుకు భార‌తీయులు మ‌క్కువ చూపిస్తుంటారు. ఎందుకంటే.. ఆర్థిక అవ‌సరాల్లో బంగారం ఉంటే కొండంత భ‌రోసా ఉన్న‌ట్లే. అందుక‌నే చాలా మంది ప‌సిడి కొనుగోలు చేస్తుంటారు. ఇక బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. తాజాగా బంగారం ధ‌ర పైకి ఎగ‌బాకింది. శ‌నివారం 10గ్రాముల బంగారం పై రూ.200 నుంచి రూ.400 వ‌ర‌కు పెరిగింది. దేశీయంగా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొర‌కంగా ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,620

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల ధర రూ.48,400

ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story