శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
August 27th Gold Price.భారతీయులు బంగారానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఆర్థిక అవసరాల్లో బంగారం
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 2:36 AM GMTభారతీయులు బంగారానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఉపయోగపడుతుందని చాలా మంది బావించడమే అందుకు కారణం. ఇక పసిడి ధరలు స్థిరంగా ఉండవు. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశియంగా రూ.150 వరకు తగ్గింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో తగ్గుదల ఉంటుంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200
ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.