పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. ఇక కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న బంగారం ధరలు గత కొన్ని నెలలుగా దిగి వచ్చాయి. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మంగళవారం పసిడి ధర స్వలంగా రూ. 110 మేర పెరిగింది. ఇక మరోవైపు వెండి కూడా బండారం బాటలోనే పయనిస్తుంది. వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు దగ్గరగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.46,260, 24 క్యారెట్ల ధర రూ.47,260
- ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.46,400, 24 క్యారెట్ల ధర రూ.50,620
- చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.44,610, 24 క్యారెట్ల ధర రూ. 48,660
- హైదరాబాదులో 22 క్యారెట్ల ధర రూ 44,250, 24 క్యారెట్ల ధర రూ. 48,270
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,270
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.