మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు

August 22th Gold price.రాఖీ పౌర్ణ‌మి వేళ మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్త ఇది అని చెప్ప‌వ‌చ్చు. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 2:18 AM GMT
మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు

రాఖీ పౌర్ణ‌మి వేళ మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్త ఇది అని చెప్ప‌వ‌చ్చు. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు నేడు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది తీపి క‌బురు. దేశీయంగా ఆదివారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.110 నుంచి రూ.170 వ‌ర‌కు త‌గ్గింది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారానికి బాగా గిరాకీ ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,210, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,210

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల ధర రూ.48,170

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it