మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర
August 21th Gold price.పసిడి ధరల్లో ప్రతి నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2021 2:29 AM GMTపసిడి ధరల్లో ప్రతి నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. ఇక నిన్న తగ్గుముఖం పట్టిన బంగారం ధర శనివారం మళ్లీ పెరిగింది. తాజాగా 10 గ్రాముల ధరపై రూ.150 నుంచి రూ.270 వరకు పెరిగింది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి బాగా గిరాకీ ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,290
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250, 24 క్యారెట్ల ధర రూ.48,280
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.