శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

August 20th Gold Price.బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్త‌. నిత్యం బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 2:26 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్త‌. నిత్యం బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌లు తాజాగా దిగివ‌చ్చాయి. శుక్రవారం దేశీయంగా 10 గ్రాముల ధరపై రూ.370 వరకు తగ్గుముఖం పట్టింది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ప‌సిడికి భారీగా డిమాండ్ ఏర్ప‌డుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,540

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల ధర రూ.48,100

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story