మహిళలకు షాక్.. 7 రోజుల్లో రూ.1030 పెరిగిన బంగారం ధర
August 19th Gold price.పసిడి అంటే భారతీయులకు వ్యామోహం. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఆస్తిగా బావిస్తారు.
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 7:51 AM ISTపసిడి అంటే భారతీయులకు వ్యామోహం. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఆస్తిగా బావిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందువల్లనే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇటీవల పెరుగుతోంది. గడిచిన 7 రోజుల్లో రూ.1030 మేర బంగారం ధర పెరిగింది. ఇక గురువారం కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,660
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,640, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.