మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
August 18th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 18 Aug 2021 7:48 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు నిత్యం దృష్టిపెడుతుంటారు. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా ధరలు పెరిగాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ. 46,430 ఉండగా 24 క్యారెట్ల ధర 47,430 గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,430, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,430
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,630
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.