పసిడి ప్రియులకు శుభవార్త.. 10 రోజుల్లో రూ.540 తగ్గిన బంగారం ధర
August 17th Gold price.నిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 17 Aug 2021 2:32 AM GMTనిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు 3 రోజులు తగ్గగా.. 4 రోజులు పెరిగాయి. మరో 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. గత 10 రోజుల్లో నగల బంగారం 10 గ్రాములు ధర రూ.540 తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా దేశీయంగా బంగారం ధరలు కొన్ని చోట్ల స్వల్పంగా తగ్గుముఖం పట్టగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా పెరిగాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,530
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.