ప‌రుగులు పెడుతున్న‌ప‌సిడి

August 15th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ధ‌రలు ఒక్కోసారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 7:40 AM IST
ప‌రుగులు పెడుతున్న‌ప‌సిడి

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ధ‌రలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. ఆదివారం కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.290 మేర ధర పెరిగింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 47,150 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌రలు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story