మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

August 14th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక్కోసారి పెరిగితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 8:04 AM IST
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక్కోసారి పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. కాగా.. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర పెరుగుతూ వ‌స్తోంది. తాజాగా శనివారం కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.320 మేర ధర పెరిగింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ. 45,860 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 46,540 గా ఉంది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,860

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story