పసిడి ప్రియులకు శుభవార్త
August 12th Gold price.నిత్యం పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2021 2:17 AM GMTనిత్యం పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇటీవల కాస్త దిగివచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఒక్క చెన్నై నగరంలో మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.45,280 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,280 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.