ఇన్‌క‌మ్ ట్యాక్స్ పేయర్స్ కోసం కొత్త వెబ్ సైట్ రాబోతోంది..!

New website for Income tax payers.ట్యాక్స్ పేయర్స్ కోసం కొత్త వెబ్ సైట్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుని వస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 11:43 AM GMT
taxpayers New website

ట్యాక్స్ పేయర్స్ కోసం కొత్త వెబ్ సైట్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుని వస్తోంది. ఇకపై ఈ-ఫైలింగ్‌కు కొత్త పోర్టల్ ను ఆశ్రయించాల్సి రావొచ్చు. కొత్త ఈ-ఫిల్లింగ్ వెబ్సైట్ ను వచ్చే నెలలో ట్యాక్స్ పేయర్స్ కోసం తీసుకుని రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ట్యాక్స్ పేయర్ల ఎన్నో సమస్యలను, అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే కాకుండా ఎన్నో ఉపయోగాలు ఈ కొత్త వెబ్ సైట్ ద్వారా ఉంటాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలోనే ఈ కొత్త వెబ్ సైట్ రానుంది. కొత్త వెబ్ సైట్ రూపకల్పన కోసం శ్రమిస్తూ ఉన్నందుకు గానూ.. జూన్ 1-6 వరకూ ప్రస్తుతం ఉన్న ఈ-ఫైలింగ్ పోర్టల్ పని చేయదని అధికారులు తెలిపారు. ఈ ఆరు రోజులు పాత పోర్టల్ డౌన్ చేసి ఉంటామని చెప్పారు.

తీసుకుని రాబోయే కొత్త వెబ్ సైట్ యూజర్ ఫ్రెండ్లీ అని అధికారులు వెల్లడించారు. పాత వెబ్ సైట్ పోర్టల్ అయిన www.incometaxindiaefiling.gov.in ని.. కొత్తగా www.incometaxgov.in మార్చబోతున్నారు. అన్ని పనులు పూర్తీ చేసి జూన్ 7న పోర్టల్ ను మొదలు పెడతామని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్ www.incometaxindiaefiling.gov.in జూన్ 1 నుండి 6వ తేదీ వరకూ అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. అటు ట్యాక్స్ పేయర్లకు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు కూడా వెబ్ సైట్ అందుబాటులో ఉండదని అధికారులు చెప్పారు. కొత్తగా వచ్చే వెబ్ సైట్ ను అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ట్యాక్స్ పేయర్లు కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని సరికొత్త హంగులతో వెబ్ సైట్ ను తీసుకుని వస్తామని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కొత్త వెబ్ సైట్ తో పనులు కూడా చకచకా జరిగిపోతాయని హామీ ఇచ్చింది.


Next Story