ఫోన్‌ పేతో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?

మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి చాలామంది ఫోన్‌ పే యాప్‌ని వినియోగిస్తున్నారు. ఈ మొబైల్‌ యాప్‌ ఫ్రీ సర్వీస్‌ను అందిస్తుండటంతో వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు.

By అంజి
Published on : 9 July 2025 10:30 AM IST

investing, PhonePe, Mutual Funds, Business

ఫోన్‌ పేతో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?

మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి చాలామంది ఫోన్‌ పే యాప్‌ని వినియోగిస్తున్నారు. ఈ మొబైల్‌ యాప్‌ ఫ్రీ సర్వీస్‌ను అందిస్తుండటంతో వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. మరికొందరు ఇదే యాప్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ యాప్‌ మన పెట్టుబడులను సులభతరం చేస్తున్నప్పటికీ ఓ ప్రతికూలత ఉంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం గురించి పెద్దగా అవగాహన లేని వారికి కూడా ఈ యాప్‌ చాలా సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. కేవలం కొన్ని క్లిక్‌లలోనే పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని కలిగిస్తుంది. కానీ.. ఈ ప్లాట్‌ఫామ్‌ సాధారణంగా రెగ్యులర్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్లాన్‌లను అందిస్తుంది. అంటే.. ఇందులో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది దీర్ఘకాలంలో పెట్టుబడులపై వచ్చే రాబడిని తగ్గిస్తుంది. ఉదాహరణకు డైరెక్ట్‌ ప్లాన్‌లలో 0.75 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటే.. రెగ్యులర్‌ ప్లాన్‌లో అది 1.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ చిన్న తేడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారొచ్చు.

ఒక వేళ మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టయితే Groww, Upstox, Zerodha వంటి ప్లాట్‌ఫామ్‌లను పరిశీలించడం జరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌లు చాలా వరకు డైరెక్ట్‌ ప్లాన్‌లను అందిస్తాయి. డైరెక్ట్‌ ప్లాన్‌లలో కమీషన్‌ ఉండదు. కాబట్టి ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో మీ రాబడిని పెంచుతుంది. పైగా ఈ ప్లాట్‌ఫామ్‌లలో వివిధ రకాల మ్యూచవల్‌ ఫండ్స్‌, ఇతర పెట్టుబడి ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలకు బాగా సరిపోయే మల్టిఫుల్‌ ఆప్షన్స్‌ ఉంటాయి.

Next Story