పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు తప్పనిసరి. అయితే, పాన్‌కార్డ్‌లో ఉండే చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ తప్పుల్ని మన మొబైల్‌లోనే ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా చేయండి
మొదట మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో NSDL వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి.
అప్లికేషన్ టైప్ దగ్గర Changes or Correction in existing PAN Data పైన క్లిక్ చేయండి.
మిగిలిన వివరాలను ఎంటర్ చేయండి.
చివరలో పాన్ కార్డు నంబర్‌ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్ చేయండి. ఇలా మీ పాన్‌కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని సరి చేసుకోవచ్చు.
పాన్‌కార్డు తప్పనిసరి
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి అత్యంత ముఖ్యమైనది పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్). పాన్ డిజిట్ నెంబర్‌ను ఆదాయ పన్ను శాఖ కేటాయిస్తుంది. ఆదాయం పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారు పాన్‌కార్డు కలిగి ఉండటం తప్పనిసరి అయ్యింది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనల ప్రకారం.. ఏ ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డు కలిగి ఉండరాదు. అలా ఉన్నట్లయి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి.