ఇతరులు లోన్లు తీసుకుంటే.. మీరు సంతకం పెడుతున్నారా?
బ్యాంకులో హోమ్, ఇతర భారీ లోన్లు తీసుకునే ముందు విట్‌నెస్, గ్యారంటీ సంతకం చేయించాల్సి ఉంటుంది.
By అంజి Published on 28 May 2024 5:09 PM IST
ఇతరులు లోన్లు తీసుకుంటే.. మీరు సంతకం పెడుతున్నారా?
బ్యాంకులో హోమ్, ఇతర భారీ లోన్లు తీసుకునే ముందు విట్‌నెస్, గ్యారంటీ సంతకం చేయించాల్సి ఉంటుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అడుగుతున్నారని అందులో కొందరు సంతకం పెడుతుంటారు. ఏం అవుతుందిలే అనుకుంటే అది విపరీత పరిస్థితులకు దారి తీస్తుందని గుర్తుంచుకోండి. సెక్షన్ 126 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1982 కింద తీసుకున్న లోన్‌కు రుణ గ్రహీత మాదిరే మీరూ జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దానికి మీరు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అక్కడ మీరు చేసింది సంతకం మాత్రమే కాదు కాంట్రాక్ట్ అని మరిచిపోవద్దు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మీ జీతంలో నుంచే ప్రతీ నెలా ఈఎమ్‌ఐ కూడా కట్ చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తాయి. లేదా మీ ఆస్తులను వేలం వేస్తామని నోటీసులు పంపుతాయి. అక్కడితో ఆగిపోదు.. మీ సిబిల్ స్కోర్ ప్రభావితమవుతుంది. మీరు పర్సనల్‌గా లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తాయి. కాబట్టి ఇలాంటి సంతకాలు చేసే ముందు ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ముందడుగు వేయండి.