పండుగ పూట షాకిస్తున్న బంగారం ధ‌ర

April 2nd Gold Price.ఉగాది పండుగ పూట ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త నాలుగైదు రోజులుగా త‌గ్గుముఖం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2022 2:28 AM GMT
పండుగ పూట షాకిస్తున్న బంగారం ధ‌ర

ఉగాది పండుగ పూట ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త నాలుగైదు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన ప‌సిడి ధ‌రలు తాజాగా మ‌ళ్లీ పెరిగాయి. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై ఏకంగా రూ.490 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ బ‌ట్టి ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,730

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,550

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల ధర రూ.52,470

వెండి ధరలు

వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నిస్తోంది. కిలో వెండి పై రూ.800 నుంచి రూ.1000 మేర పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో రూ. 67,600, ముంబైలో రూ. 67,600, చెన్నైలో రూ.71,700, హైదరాబాద్‌లో రూ. 71,700, విజయవాడలో రూ. 71,700, విశాఖపట్నంలో రూ. 71,700 గా కొన‌సాగుతోంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story