శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

April 29th Gold Price.మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. ధ‌ర పెరిగిన‌ప్ప‌టికీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 2:24 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. ధ‌ర పెరిగిన‌ప్ప‌టికీ కొనుగోళ్లు మాత్రం జ‌రుగుతూనే ఉంటాయి. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయన్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు వీటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. కాగా.. నేడు ప‌సిడి ధర త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.490 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా ప‌సిడి ధ‌ర‌ల్లో తేడాలుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48.000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,080, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,450

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల ధర రూ.52,370

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story