మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
April 27th Gold Price.ఉక్రెయిన్-రష్యా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బంగారం ధరలకు
By తోట వంశీ కుమార్ Published on 27 April 2022 2:13 AM GMTఉక్రెయిన్-రష్యా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతుండడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుముఖం కనిపిస్తోంది. తాజాగా నేడు కూడా పసిడి ధర భారీగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ.580 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల కారణంగా పసిడి ధరల్లో తేడాలుంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48.400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,250
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,910
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450, 24 క్యారెట్ల ధర రూ.52,860
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.