బంగారం కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ధర
April 14th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2022 2:26 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకనే పసిడి కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఇటీవల పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. నేడు కూడా ధర పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ.350 మేర పెరిగింది. దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల ఆధారంగా పసిడి ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల ధర రూ.53,840
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.