జన్‌ధన్‌ ఖాతా తెరవండి.. రూ. 2 లక్షల వరకు బెన్‌ఫిట్‌ పొందండి

Apply for SBI Rupay Jandhan card today get benefits of 2 lakh rupee.ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన -పీఎంజేడీవై కింద సున్నా బ్యాలెన్స్‌పై జన్‌ధన్‌ అకౌంట్‌ తెరుచుకోవచ్చు, రూ. 2 లక్షల వరకు బెన్‌ఫిట్‌ పొందండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 7:16 AM GMT
Apply for SBI Rupay Jandhan card today get benefits of 2 lakh rupee

మీరు కొత్తగా జన్‌ధన్‌ ఖాతాను ఓపెన్‌ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతాను తెరిస్తే రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్‌ పొందే అవకాశం ఉంటుంది.

ఇందు కోసం మీరు ఎస్‌ఐబీ రూపే జన్‌ధన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలు ఎస్బీఐ ట్వీట్‌ ద్వారా ప్రజలకు తెలియజేసింది. అయితే ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన -పీఎంజేడీవై కింద సున్నా బ్యాలెన్స్‌పై జన్‌ధన్‌ అకౌంట్‌ తెరుచుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది ఈ ఖాతాను తెరిచి ఉన్నారు. అయితే ఈ ఖాతాను తెరిస్తే అనేక ప్రయోజనాలు కల్పిస్తోందని కేంద్రం. ఈ ఖాతాను తెరిచిన వారికి రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీని కోసం మీరు 90 రోజులకు ఓసారి కార్డును స్వైప్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది.


జన్‌ధన్‌ ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు

ఈ ఖాతా తెరిచేందుకు మీ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్ తో పాటు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి కావాల్సిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ తెరవాలంటే ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలపైన ఉన్న వారు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.

అలాగే జన్‌ధన్‌ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మీరు జన్‌ధన్‌ ఖాతా ఉంటే ఓవర్‌ డ్రాప్ట్‌ ద్వారా మీ ఖాతా నుంచి రూ.10 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు.


Next Story