సెప్టెంబర్ 22న ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఈ పండగ సీజన్ లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెసిట్వల్ సమయంలో ప్రైమ్ సభ్యుల కోసం మరింత విలువ, సౌకర్యం మరియు ఆనందాలను అందించడానికి రూపొందించబడిన ప్రయోజనాలతో అమేజాన్ ఉత్సాహవంతమైన సంబరాలు చేస్తోంది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 Sept 2025 5:53 PM IST

సెప్టెంబర్ 22న ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఈ పండగ సీజన్ లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెసిట్వల్ సమయంలో ప్రైమ్ సభ్యుల కోసం మరింత విలువ, సౌకర్యం మరియు ఆనందాలను అందించడానికి రూపొందించబడిన ప్రయోజనాలతో అమేజాన్ ఉత్సాహవంతమైన సంబరాలు చేస్తోంది. సెప్టెంబర్ 22న 24 గంటలు ముందుగా ప్రారంభమయ్యే ప్రైమ్ ను ముందస్తుగా పొందే అవకాశంతో పాటు, సభ్యులు ప్రైమ్ ఫెస్టివ్ ఆఫర్లను కూడా పొందగలరు, స్మార్ట్ ఫోన్లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ఫ్యాషన్, హోమ్ & కిచెన్ , బ్యూటీ మరియు ఇంకా ఎన్నో అలాంటి శ్రేణుల్లో ఇప్పటికే ఉన్న అగ్ర పండగ డీల్స్ పై 10% వరకు తగ్గింపు పొందండి.

ప్రైమ్ వినోదంతో ఉత్తమమైన సౌకర్యం మరియు విలువలను కలిపింది, ప్రతి క్షణం నుండి సభ్యులు అత్యధికంగా పొందేలా నిర్థారిస్తోంది. 10 లక్షల ఉత్పత్తులపై అదే రోజు ఉచిత సర్వీస్ మరియు 40 లక్షలకు పైగా ఉత్పత్తులపై మరుసటి రోజు డెలివరీతో డెలివరీ వేగాలను ప్రైమ్ కొనసాగిస్తోంది. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్న ప్రైమ్ యూజర్లు రూ. 3,000 విలువ గల వెల్కం రివార్డ్స్ ను పొందవచ్చు మరియు అమేజాన్ పై షాపింగ్ మరియు ప్రయాణ బుక్కింగ్స్ పై అపరిమితంగా 5% క్యాష్ బ్యాక్ సంపాదించవచ్చు. దీనికి అదనంగా, ప్రైమ్ నో-కాస్ట్ EMIలు, ముందస్తు డీల్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, మరియు NPCI భారత్ బిల్ పే ద్వారా నిరంతరంగా సబ్ స్క్రిప్షన్ చెల్లింపులు ద్వారా ఆదాలను సరళం చేసింది మరియు ఎయిర్ టెల్, టాటా ప్లే మరియు ఇతరులతో భాగస్వామ్యాలు సులభంగా సేవలు పొందడంలో సహాయపడుతోంది.

షాపింగ్ మాత్రమే కాకుండా, సభ్యులు అమేజాన్ మ్యూజిక్ పై ప్రైమ్ వీడియో మరియు MX ప్లేయర్ పై బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఆడ్-ఫ్రీ మ్యూజిక్ మరియు పాడ్ కాస్ట్స్ ను, ప్రైమ్ రీడింగ్ ద్వారా ప్రసిద్ధి చెందిన టైటిల్స్, ప్రైమ్ గేమింగ్ పై లీనమయ్యే అనుభవాలను కూడా ఆనందించవచ్చు. ఈ పండగ సీజన్ లో, ప్రైమ్ వీడియో భారతదేశం మరియు ప్రపంచం చుట్టు ప్కకల నుండి ఉత్తేజభరితమైన 13 కొత్త సీరీస్ శ్రేణిని మరియు భాషలు మరియు శైలుల్లో మూవీస్ ను తెస్తోంది. అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ అభిమానుల కోసం, ప్రైమ్ వీడియో మూవీస్ మరియు సీరీస్ శ్రేణిని మీకు అందిస్తోంది. షేన్ బ్లాక్ దర్శకత్వంవహించిన, మార్క్ వాల్ బెర్గ్, లకీత్ స్టాన్ ఫీల్డ్ మరియు రోజా సలాజర్ లు నటించిన క్రైమ్ థ్రిల్లర్ ప్లే డర్టీ అక్టోబర్ 1న ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. అంతిమ చాప్టర్-అవర్ ఫాల్ట్ (కల్పా న్యుస్ట్రా), నికోలే వాల్లాస్ మరియు గ్రేబియల్ గువారాలు నటించిన ఎంతగానో ఎదురుచూస్తున్న కప్ లాబుల్స్ సాగా ఈ అక్టోబర్ 16న విడుదలవుతోంది. ఈ పండగ సీజన్ లో టు మచ్ ట్వింకిల్ మరియు కాజోల్ తో అత్యంతగా అంచనా వేయబడిన టాక్ షో ఆనందించండి, ఈ షో మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది మరియు కొత్త ఎపిసోడ్స్ ప్రతి గురువారం విడుదలవుతాయి.

అమేజాన్ MX ప్లేయర్ అవార్డ్ లు గెలుచుకున్న వెబ్ సీరీస్, రియాల్టీ షోలు, అంతర్జాతీయ కంటెంట్ మరియు వివిధ భాషల్లో విస్తృతమైన మూవీ లైబ్రరీ వంటి పండగ శ్రేణిని అందిస్తోంది. రైజ్ అండ్ పాల్ ద్వారా సంబరాలు ప్రారంభమవుతాయి, 16 మంది సెలబ్రిటీలు పాల్గొనే దీని ఫినాలే అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది మరియు స్క్రిప్ట్ లేని ఈ రియాలిటీ షోను అష్నీర్ గ్రోవర్ నిర్వహిస్తున్నారు. ఈ సీజన్ మార్కీ ఫ్రాంఛైజీలు మళ్లీ ప్రవేశించడాన్ని కూడా సూచిస్తోంది-సిక్సర్ సీజన్ 2 (సెప్టెంబర్ 24), ఎక్స్ ప్లోరింగ్ క్రికెట్, రిసీలియెన్స్, మరియు ఫ్రెండ్షిప్స్ మరియు జమ్నాపార్, అక్టోబర్ ప్రారంభంలోనే షంకీ హృదయపూర్వకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మిశ్రమానికి అదనంగా, MX Vdesi మై లవ్లీ లయర్, ట్వింక్లింగ్ వాటర్ మెలన్, మరియు వెడ్డింగ్ ఇంపాజిబుల్ వంటి ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ టైటిల్స్ ను కూడా హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో తెచ్చింది.

ప్రత్యేకమైన ముందస్తు కొనుగోళ్ల అవకాశం నుండి బ్లాక్ బస్టర్ డీల్స్, సాటిలేని అపరిమితమైన వేగవంతమైన డెలివరీలు మరియు సాటిలేని ఎంటర్టైన్మెంట్ ఎంపికలు వరకు ప్రైమ్ భారతదేశంలో లక్షలాది సభ్యుల కోసం రోజూవారీ జీవితాన్ని మరింత మెరుగ్గా చేస్తోంది. ప్రైమ్ ను మరింత సమీకృతంగా చేయడానికి టియర్స్ లో సభ్యత్వం కేవలం 399కి లభిస్తోంది. కస్టమర్లు ప్రైమ్ ఏన్యువల్ ను రూ. 1,499కి పొందవచ్చు, ఇది అన్ని ప్రయోజనాలు అందిస్తుంది; ప్రైమ్ లైట్ రూ. 799కి పొందవచ్చు, ఇది పరిమితంగా ప్రైమ్ వీడియోను పొందే అవకాశంతో షాపింగ్ ప్రయోజనాలు అందిస్తుంది; లేదా ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ను రూ. 399కి పొందవచ్చు, ఇది షాపింగ్-మాత్రమే ప్రయోజనాన కోసం రూపొందించబడింది.

అభినవ్ అగర్వాల్, డైరెక్టర్, అమేజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ ఇలా అన్నారు, “పండగ సీజన్ ఆనందానికి, ఇళ్లను అభివృద్ధి చేయడానికి, ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడానికి తగిన సమయం. ప్రైమ్ తో, ఉత్తమమైన కొనుగోళ్లు, ఆదాలు, మరియు ఎంటర్టైన్మెంట్ ల ఉత్తమమైన కలయికల అనుభవాలను అందివ్వడానికి మేము ఆనందిస్తున్నాం. ఈ దీపావళికి, ముందస్తుగా కొనుగోళ్ల అవకాశం పొందడం, ప్రైమ్ ఫెస్టివ్ ఆఫర్లు, మరియు సాటిలేని డెలివరీ వేగాలు వంటి ప్రయోజనాలు ద్వారా ప్రైమ్ సభ్యులు సంబరాలను మరింత భారీగా, ఆకర్షణీయంగా, మరియు మరింత బహుమానపూర్వకంగా చూడవచ్చు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025కి ముందు Amazon.in ‘ఎర్లీ డీల్స్ ‘ కూడా విడుదల చేసింది, సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమయ్యే ఉత్తేజభరితమైన ప్రీ-ఫెస్టివల్ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తోంది. 1 లక్షకు పైగా ఉత్పత్తుల విస్తృత శ్రేణి ఎంపికపై కస్టమర్లు Amazon.in పై సంవత్సరంలో అతి తక్కువ ధరలను, ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆఫర్లు, శామ్ సంగ్, ఆపిల్, ఇంటెల్, HP, అసూస్, టైటాన్, HP, లిబాస్, లోరియల్ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అతి పెద్ద బ్రాండ్స్ నుండి 30,000+ కొత్త విడుదలల్ని కూడా అన్వేషించవచ్చు. స్మార్ట్ ఫోన్స్ పై 40% వరకు తగ్గింపు పొందవచ్చు; ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ కిచెన్ & అవుట్ డోర్స్ పై 80% వరకు తగ్గింపు పొందవచ్చు; రోజూవారీ అవసరాలపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు; TVలు మరియు గృహోపకరణాలపై 65% వరకు తగ్గింపు పొందవచ్చు; అమేజాన్ ఫ్రెష్, ఇకో విత్ అలెక్సా, ఫైర్ TV & కిండిల్ మరియు ఇంకా ఎన్నో వాటిపై పై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఏడాది షాపింగ్ ఉత్సవం పండగ సంబరాలకు అనుబంధంగా విస్తరించిన డెలివరీ నెట్ వర్క్స్, AI-పవర్డ్ షాపింగ్ ఉపకరణాలు, ప్రత్యేకమైన వినోదపు ఎంపికలు ద్వారా మెరుగైన కొనుగోళ్ల అనుభవాలను తెచ్చింది.

Next Story