త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్.. రెడీగా ఉండండి
Amazon great freedom festival sale to begin on august 6. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరో భారీ సెల్‌తో ముందుకు
By అంజి Published on 1 Aug 2022 5:53 PM ISTప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరో భారీ సెల్‌తో ముందుకు రాబోతోంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో భారీ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఆగస్టు 6 నుంచి 10 వరకు ఈ సేల్ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఈ కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ రాయితీ కూడా అందించనుంది. ఈ సేల్‌లో వివిధ ప్రొడక్ట్స్‌పై కస్టమర్లు బంఫర్ డిస్కౌంట్‌లను పొందొచ్చు.
ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై రెగ్యులర్ డిస్కౌంట్స్, ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మోడల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర ఎలక్ట్రానిక ప్రొడక్ట్స్‌పై కస్టమర్లకు మంచి డిస్కౌంట్ లభిస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు తర్వాత, రూ. 6,599 ధరను పొందవచచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం, న్యూ మోడల్స్ మొబైల్‌లపై నెలకు రూ. 2083 ప్రారంభ నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యం ఉంటుంది. సేల్ సమయంలో, కస్టమర్‌లు హెడ్‌ఫోన్‌లు, నెట్‌వర్కింగ్ రూటర్‌లపై 50 శాతం వరకు తగ్గింపుతో పాటు స్పెషల్ ఆపర్స్‌తో 80 శాతం వరకు భారీ తగ్గింపును పొందుతారు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివ్ సేల్‌లో టెక్నో స్మార్ట్‌ఫోన్‌లు 30 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. అలాగే ఎల్‌జీ డివైజ్‌లపై కూడా సేల్‌లో 30 శాతం తగ్గింపు ఉంది. న్యూ అలెక్సా డివైజ్‌పై కూడా ఈ సేల్‌లో 45 శాతం భారీ తగ్గింపు ఉంది. ఫైర్ టీవీ స్టిక్‌పై గరిష్టంగా 44 శాతం తగ్గింపు ఉంది. రక్షా బంధన్ కూడా రానుండటంతో ఈ సీజన్‌లో అమెజాన్ సేల్ మెరుగైన అవకాశంగా ముందుకొస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, ట్యాబ్లెట్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే అమెజాన్‌లో ఓ లుక్కేయండి.