ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై 13న సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతోంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. శనివారం ఉదయం 3 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు అప్‌గ్రేడ్ ప్రక్రియ ఉంటుందని, ఆ సమయంలో బ్యాంకింగ్, పేమెంట్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొంది. కస్టమర్లకు మెరుగైన సేవలు, బ్యాంకింగ్ అనుభూతిని అందించడానికి ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియను నిర్వహిస్తోంది.
సుమారు 13.30 గంటల పాటు అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్ తెలిపింది. ఆ సమయంలో బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని, కస్టమర్లు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు జులై 12నే తగిన మొత్తాన్ని విత్‌డ్రా అయినా డిపాజిట్ అయినా చేసుకోవాలని సూచించింది. సెలవు రోజున అప్‌గ్రేడింగ్ ప్రక్రియను చేపడుతున్నామని, అందరూ సహకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ విజ్ఞప్తి చేసింది.
ఏయే సమయాల్లో ఏయే సర్వీసులు అందుబాటులో ఉండవనే దానిపై బ్యాంకు ఓ టేబుల్‌ను విడుదల చేసింది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.