అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...

By -  అంజి
Published on : 21 Oct 2025 11:13 AM IST

AI, Job Cuts, Private Employer, TCS, Business

అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా? 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా 19,755 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో సంస్థ నుంచి తొలగించిన వారు, స్వచ్ఛందంగా వైదొలిగిన వారు కూడా ఉన్నారు. ఈ భారీ కోతతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.2 శాతం తగ్గిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

2022 మార్చి తర్వాత మొదటిసారిగా 6 లక్షల కంటే దిగువకు పడిపోయింది. స్కిల్ అండ్ కేపబిలిటీ మిస్‌మ్యాచ్ కారణంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు టీసీఎస్ సంస్థ తెలిపింది. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలకు పరిశ్రమ వేగంగా మారుతున్నందున, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగులలో 2% తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుంది.

Next Story