బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. మే నెల‌లో 12 రోజులు సెల‌వులు

12 days bank holidays in may month.క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ బ్యాంకు కార్యక‌లాపాల‌పైన ప్ర‌భావం చూపుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 10:04 AM IST
బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. మే నెల‌లో 12 రోజులు సెల‌వులు

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ బ్యాంకు కార్యక‌లాపాల‌పైన ప్ర‌భావం చూపుతోంది. ఇప్ప‌టికే చాలా మంది బ్యాంకు సిబ్బంది క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో బ్యాంకులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా.. కొన్ని చోట్ల స‌గం సిబ్బందితో.. చాలా చోట్ల మ‌ధ్యాహ్నాం రెండు వ‌ర‌కు కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాతాదారులు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. మే నెల‌లో ఏ ఏ రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయో తెలుసుకుంటే.. ప్లాన్ ప్ర‌కారం ప‌నులు పూర్తి చేసుకోవ‌చ్చు.

ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. మే నెల‌లో ఏకంగా 12 రోజులు బ్యాంకుల‌కు హాలీడేస్ వ‌చ్చాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. 12 సెలవుల్లో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ సేవలకు ఎలాంటి అంతరాయమూ ఉండదని రిజర్వు బ్యాంకు పేర్కొంది.

మే నెలలోని సెలవుల విషయానికి వస్తే..

మే 01 : మేడే

మే 02 : ఆదివారం

మే 07 : జమాతుల్ విదా

మే 08 : రెండో శనివారం

మే 09 : ఆదివారం

మే13 : ఈదుల్ ఫీతర్

మే14 : రంజాన్

మే16 : ఆదివారం

మే 22 : నాలుగో శనివారం

మే 23 : ఆదివారం

మే 26 : బుద్ద పూర్ణిమ

మే 30 : ఆదివారం


Next Story