బన్నీ మూవీ మ్యూజికల్ నైట్ ప్లాన్స్ ఎప్పుడు..? ఎక్కడ..?
By Newsmeter.Network Published on 17 Dec 2019 1:16 PM ISTస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అల.. వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికి వస్తుండడంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. బన్నీ, మహేష్ సినిమా ప్రమోషన్స్ కంటే ముందు అల.. వైకుంఠపురములో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు దూసుకెళ్లారు. ఆతర్వాత మహేష్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు. ఇలా ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడుస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అల.. వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ & అప్ డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.
అల.. వైకుంఠపురములో తాజా వార్త ఏంటంటే... ఈ సినిమా ప్రీ రిలీజ్‌ను మ్యూజికల్ నైట్ ఆఫ్ అల..వైకుంఠపురములో అనే పేరుతో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఈ మ్యూజికల్ నైట్ ఒక చోట కాకుండా రెండు చోట్ల నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 28న హైదరాబాద్‌లో, గ్రాండ్ గా ఫంక్షన్ చేసి.. ఆతర్వాత జనవరి 5న వైజాగ్‌లో మరో ఫంక్షన్ నిర్వహిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.