గీతా ఆర్ట్స్‌లో 'కార్తికేయ' సినిమా పేరేంటో తెలిస్తే షాకే..!

By Newsmeter.Network  Published on  15 Dec 2019 9:04 AM GMT
గీతా ఆర్ట్స్‌లో కార్తికేయ సినిమా పేరేంటో తెలిస్తే షాకే..!

భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి చావు కబురు చల్లగా అనే టైటిల్ ఖ‌రారు చేసారు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

2020లో షూటింగ్ జరుపుకోనున్న చావు కబురు చల్లగా మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.

ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియ‌చేయ‌నుంది. ఇటీవ‌ల కార్తికేయ 90 ఎంఎల్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో డీలాప‌డిన కార్తికేయ ఇప్పుడు స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ మూవీ చేస్తున్నాడు. దీని పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి.. ఈ చావు క‌బురు చ‌ల్ల‌గా అయినా మంచి విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

Next Story