రికార్డు సృష్టిస్తున్న బంగారం ధర

By సుభాష్  Published on  15 April 2020 1:27 AM GMT
రికార్డు సృష్టిస్తున్న బంగారం ధర

దగదగ మెరిసే బంగారం మరింత మెరిసిపోతోంది. రికార్డు సృష్టించే దిశగా పరుగులు ఎడుతోంది. ఎవ్వరు ఆపినా ఆగే ప్రసక్తే లేదన్నట్లుగా బ్రేకులు వేయకుండానే పరుగెడుతుంది. బంగారం ధర వరుసగా పెరగడం ఇది ఆరో రోజు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినా మన మార్కెట్లోనూ అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది. మరోవైపు పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.

బుధవారం హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1155 పెరిగి ప్రస్తుతం రూ.45,655క చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1015 పెరుగుతూ రూ.41,855కు ఎగబాకింది.

ఇక బంగారం బాటలో కూడా వెండి పయనిస్తోంది. కిలో బంగారం ధర రూ.620 పెరుగుతూ ప్రస్తుతం రూ.41,930కి చేరుకుంది. అయితే పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ బాగా పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.420 పెరుగుతూ ప్రస్తుతం రూ.43,540కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.685 పెరుగుదలతో రూ.45,810కి ఎగబాకింది. ఇక కిలో వెండి ధర రూ.620 పెరిగి ప్రస్తుతం రూ.41,920కు చేరుకుంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర కాస్త దిగొచ్చింది. ఔన్స్‌కు 0399 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర 1760 డాలర్లకు పడిపోయింది. ఔన్స్‌కు 1751.20 డాలర్ల వద్ద ఉంది. వెండి కూడా అంతే ఔన్స్‌కు 1.01 శాతం తగ్గుదలతో 15.97 డాలర్లకు పడిపోయింది.

Next Story
Share it