పార్లమెంట్‌ సమాశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రూ.1.03 లక్షల కోట్లను 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేటాయించినట్లు చెప్పారు.

► రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు

► 2023 నాటికి చెన్నై – ముంబాయి ఎక్స్‌ ప్రెస్‌ హైవే

► 2024 నాటికి దేశవ్యాప్తంగా వంద విమానాశ్రయాలు

► 2వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణమే లక్ష్యం

► చెన్నై  బెంగళూరు ఎక్స్‌ ప్రెస్‌ హైవే

► 27వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పనులు

► మరిన్ని తేజాస్ రైళ్లు రానున్నాయి

► రూ.18వేల కోట్లతో బెంగళూరులో సబర్బన్‌ రైల్వే వ్యవస్థ

► నిర్విక్‌ బీమా పథకం ప్రారంభం

► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 రైళ్లు

► వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి రూ.27,300 కోట్లు

బ్యాంకు డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్‌

బడ్జెట్‌ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌ వినిపించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాలను విక్రయించడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలని, బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.