పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం: వర్ల రామయ్య

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 1:03 PM GMT
పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం: వర్ల రామయ్య

విజయవాడ: నేడు పత్రిక స్వేచ్చను అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంహరిస్తోందని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పత్రికను అణగదొక్కాలని చూస్తుందన్నారు. జగన్ తనకు వ్యతిరేక వార్తలు రాకుండా ఉండాలనే ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. గతంలో‌ వైయస్ 938జీవో ఇచ్చి.. ప్రజా ఉద్యమాలతో వెనక్కి తగ్గారన్నారు. ఇప్పుడు జగన్ అదే జీవో ను బయటకు తీసి మీడియా గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ధర్మాన ప్రసాదరావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని..చంద్రబాబు ఏనాడు పత్రిక స్వేచ్చను హరించలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్యం అధికారంలోకి రాగానే పలు ప్రైవేటు ఛానళ్లను ఆపించిందన్నారు వర్ల రామయ్య.

పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు - ధర్మాన

శ్రీకాకుళంలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వర్లరామయ్య వ్యాఖ్యలను ఖడించారు. అయితే పత్రికా స్వేచ్ఛపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల బాబు పాలనలో ఎన్నో అక్రమాలు, కుట్రలతో రాజకీయ పార్టీలనే సర్వనాశనం చేయటానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఇలాంటి నేతలా! పత్రికా స్వేచ్ఛపై మాట్లాడేది? కేసులపై జీఓలే ఇచ్చారు. ఒక్కటైనా కేసు వేశామా? ఆధారాలుంటే చూపించండన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయటానికే బాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. కానీ ప్రజలకు పత్రికా స్వేచ్ఛపై సీఎం జగన్‌కు ఉన్న పూర్తి విశ్వాసం తెలుసన్నారు ధర్మాన.

Next Story
Share it