తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బ్రదర్ అనిల్ కుమార్‌కు గాయాలు
By Newsmeter.NetworkPublished on : 15 Feb 2020 12:06 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద బ్రదర్ అనిల్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారులో అనిల్‌కుమార్‌తో పాటు గన్‌మెన్, డ్రైవర్ ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అక్కడకి చేరుకున్నారు. ఉదయభాను కారులో బ్రదర్‌అనిల్‌కుమార్, డ్రైవర్, గన్‌మెన్ లను విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పటల్‌కి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం.. అక్కడి నుంచి అనిల్ కుమార్‌కు వెళ్లిపోయారు. ప్రభువు కృప వల్లే బ్రదర్ అనిల్ కుమార్ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారని అన్నారు విప్ సామినేని ఉదయభాను.
Next Story