బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా వైరస్‌

By అంజి  Published on  11 March 2020 10:26 AM IST
బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా వైరస్‌

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. యూరప్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బిట్రన్‌ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా వైరస్‌ పాజిటవ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఆరోగ్య మంత్రి, ఎంపీ నదీన్‌ డారీస్‌ ప్రకటతో.. అధికారులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. కాగా ఇప్పుడు ఆమెకు కరోనా ఎలా సోకిందన్న విషయంపై వైద్యులు, అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరితో సన్నిహితంగా ఉన్నారన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. తనకు కరోనా సోకిందని, ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నానని ఎంపీ డారీస్‌ తెలిపారు. ప్రాణాంతక కరోనా వైరస్‌తో ఇప్పటికే బ్రిటన్‌లో ఆరుగురు మరణించారు. దాదాపు 370 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ బారిన పడి తొలి బ్రిటన్‌ రాజకీయ నేత డారీసే. ఇదిలా ఉంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌.. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. బోరిస్‌ జాన్సన్‌ సహా వందలాంది మంది సంప్రదింపులు జరిపిన క్రమంలో వారికి స్క్రీనింగ్‌ నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డారీస్‌ కోలుకుంటున్నారని అక్కడి అధికారులు చెప్పారు.

Also Read:వుహాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటన

మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ఇటలీలో భారత పర్యాటకులు చిక్కుకున్నారు. తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌లైన్స్‌ బోర్డింగ్‌కు అనుమతించడం లేదని సమాచారం. కరోనా లేదని నిర్దారిస్తూ సర్టిఫికెట్లు చూపితేనే బోర్డింగ్‌కు అనుమతిస్తున్నారని తెలిసింది. కాగా కరోనా పరీక్షలు చేసేందుకు ఇటలీ అధికారులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తమ దేశంలో వేలాది మంది కరోనా బారినపడ్డారని, వారికి వైద్యం చేయడమే ప్రథమ కర్తవ్యమని ఇటలీ అధికారులు అంటున్నారని భారత పర్యాటకులు చెబుతున్నారు.

Also Read: చిన్నారులకు పోర్న్ చూపించిన నిత్యానంద

ప్రపంచ వ్యాప్తంగా 105 దేశాలకు కరోనా వైరస్‌ పాకింది. ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 54 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4,270 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 1.18 లక్షలకు చేరింది. పలు దేశాలు ఇటలీకి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాయి. పర్యాటకం ఎక్కువ ఉన్న దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే చైనా ఆర్థికంగా కుదేలైంది.

Next Story