వుహాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటన

By అంజి  Published on  11 March 2020 3:03 AM GMT
వుహాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటన

మొట్టమొదటగా కరోనా వైరస్ ఉద్భవించిన వూహాన్ నగరంలో తొలిసారి చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు. కరోనా వైరస్ నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు. ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు అధికారులు, అధికారులు, వాలంటీర్లు, కరోనా వైరస్ రోగులు, వూహాన్ వాసులను జిన్ పింగ్ ప్రశంసించారు. జిన్ పింగ్ వెంట కమ్యూనిస్టు పార్టీ చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ తదితరులున్నారు.

Chinese President Xi jinping visits Wuhan

వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో 1,13,000 మందికి సోకింది. దీనివల్ల 4వేల మంది మరణించారు. భారత్ తోపాటు ఖతార్, యూకే, దక్షిణ కొరియా తదితర దేశాలు చైనా నుంచి పర్యాటకుల రాకను నిషేధించింది. పలు దేశాలు తమ దేశ పౌరులు చైనాలో పర్యటించవద్దని ఆదేశించాయి. అయితే అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆస్పత్రులు నిర్మించి, కట్టుదిట్టంగా వ్యవహరిస్తుండడంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Chinese President Xi jinping visits Wuhan

ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించుందకు ఏకంగా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక రోజు పాటు నగరంలో స్వయంగా పర్యటించారు. ముఖానికి మాస్క్ కట్టుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి అధికారులతోపాటు నగర ప్రజలు చాలా కష్టపడుతున్నారని ఆయన అభినందించారు.

Next Story