తొలిరాత్రి కోసం అంతా సిద్దం.. అధికారులు వ‌చ్చి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2020 2:01 PM GMT
తొలిరాత్రి కోసం అంతా సిద్దం.. అధికారులు వ‌చ్చి..

క‌రోనా కార‌ణంగా దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా వ‌ర‌కు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలాంటి ముహూర్తం మ‌ళ్లీ రాదంటూ.. అధికారుల ప‌ర్మిష‌న్ తీసుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ అతి కొద్ది స‌మ‌క్షంలో మ‌రికొంద‌రు వివాహాం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాగ‌నే క‌ర్ణాట‌క ఉడుపి జిల్లాలోని కుత్యూరులో విహాహం జ‌రిగింది. పెళ్లి త‌రువాత.. ఆ పెళ్లికొడుకు పెళ్లికూతురితో క‌లిసి త‌న స్వ‌గ్రామ‌మైన బోలాకు చేరుకున్నారు. ఇక మొద‌టి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పెళ్లికోసం ఆ యువ‌కుడు మంగ‌ళూరు వెళ్లి వ‌చ్చాడ‌న్న స‌మాచారం అందుకున్న ఆరోగ్య‌శాఖ అధికారులు ఆ పెళ్లి ఇంటికి చేరుకున్నారు. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా పెళ్లి కొడుకుతో పాటు ఆ పెళ్లికి హాజ‌రైన 26 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని స‌దరు అధికారులు ఆదేశించారు. ఎన్నో రోజుల నుంచి క‌ల‌లు క‌న్న మొద‌టి రాత్రి ర‌ద్దు కావ‌డంతో ఆ పెళ్లి కొడుకు బాధ వ‌ర్ణనాతీతం.

Next Story