కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Jun 2020 6:48 AM GMT
కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి

కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు మర్కుక్ మండలం శివారు వెంకటాపురం వద్ద గండి పడింది. దీంతో వెంకటాపురం గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పలువురి ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించాయి. జగదేవ్‌పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని ఎం. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపేందుకు కొండపోచమ్మ సాగర్ నీటిని విడుదల చేశారు.

ఉదయం 7గంటల ప్రాంతంలో కాలువకు గండి ప‌డింది. దీంతో పొలాలు, కూరగాయల తోటలతో పాటు, గ్రామంలోకి భారీగా నీరు చేరింది. గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. గండి ప‌డిన ప్రాంతం.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు మూడు కిలోమీట‌ర్ల‌ దూరం.

Next Story