అమ్మకడుపు నుంచి అప్పుడే ప్రపంచంలోకొచ్చిన ఏ శిశువైనా ఏడవడం సర్వ సాధారణం. కొంత మంది శిశువులైతే బయటికి రాగానే నిద్రపోతుంటారు. కానీ బ్రెజిల్ లో ఇందుకు భిన్నంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అమ్మ కడుపులో నుంచి బయటికొచ్చిన ఆ శిశువు తనను బయటికి తీసిన డాక్టర్ల వైపు కోపంగా చూసిందట. అలా కోపంగా చూస్తున్న శిశువును ఫోటో తీసి..నెట్టింట్లో షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫొటో చూసిన పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ”నన్ను ఎందుకు లేపావు ” అని ఒకరు.. ”అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని నీకు చెప్పానా” అని ఇంకొకరు ట్రోల్స్ చేస్తున్నారు. మరొకరైతే ” నేను ఆడపిల్లను కదా. మా అమ్మ కడుపులో ఉంటేనే నేను సేఫ్ గా ఉంటాను కదా. ఎందుకురా నన్ను బయటికి తీశావు. అసలు ఈ సమాజం మంచిది కాదు. ఆడపిల్లకి సేఫ్టీ లేదు. ఇంక నేను ఎన్ని బాధలు భరించాలో అని డాక్టర్ వంక అలా కోపంగా చూస్తుంది ” అని కామెంట్ చేశారు.

”పడుకున్న సింహాన్ని లేపాడు. ఇంక ఆ డాక్టర్ పని అయిపోయింది ”, నా మానాన నేను లోపల నిద్రపోతుంటే..నిన్నెవడు బయటికి తీయమన్నాడు అని కోపంగా చూస్తుంది.” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.