మూడు లక్షలకు పైగా వలస కార్మికులను, విద్యార్థులను, టూరిస్టులను వారి, వారి గమ్యస్థానాలకు చేర్చడానికి 2050 శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ను ఉపయోగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో టోపీలు పెట్టుకున్న పిల్లలు ట్రైన్స్ లో కిటికీల దగ్గర ఉన్న వాళ్లకు నీటిని అందిస్తూ ఉన్నారు.
“Children from local madarsa providing cold water to migrants boarding trains… मिला हमेशा चाहत का पैग़ाम मदरसों से @ShayarImran @sudhirchaudhary @ZeeNews. ये तालीम और तरबीयत हमें इस्लाम सिखाता है. అంటూ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.
స్థానిక మద్రసాకు చెందిన పిల్లలు చల్లని నీటిని వలస కూలీలకు అందిస్తూ ఉన్నారని.. ఇది నిజమైన చదువు అని.. ఇస్లాం బోధించేది అని ఆ పోస్టులో రాశారు.
ఆ ఫోటోలలో ప్యాసెంజర్లు కానీ.. నీళ్లు అందిస్తున్న పిల్లలు కానీ మాస్కులతో కనిపించలేదు.
నిజమెంత:
ఆ పిల్లలు వలస కార్మికులకు చల్లని నీరు అందిస్తూ ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ' పచ్చి అబద్ధం'.
న్యూస్ మీటర్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలుగా వాడుతూ వస్తున్నారు.
‘who is the real Indian' అంటూ పలు ఫోటోలతో కలిపి ఈ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.
'me.me’ అనే మీమ్స్ ప్లాట్ ఫామ్ లో కూడా 'రియల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్' అంటూ ఈ ఫోటోను పోస్టు చేశారు.
మే21, 2016న తమిళ బ్లాగ్ పోస్టులో కూడా పోస్టు చేశారు. "This is what Islam teaches us. It is such actions that inspire the idea of helping others at an early age.” అంటూ ఆర్టికల్ ను పోస్టు చేశారు.
అంతేకానీ వలస కూలీల కోసం పిల్లలు చల్లని నీళ్లు పంచుతూ ఉన్నారన్నది పచ్చి అబద్ధం. ఈ ఫోటో సోషల్ మీడియాలో 2016 నుండి వైరల్ అవుతూ ఉంది.