నిపుణుల కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధాని - మంత్రి బొత్స
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2019 10:02 PM ISTవిశాఖపట్నం: ఏపీ రాజధానిపై మరోసారి కామెంట్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. "నిపుణుల కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధాని "అన్నారు బొత్స. రాజధాని ఎక్కడనేది నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే తెలుతుందన్నారు. అంతేకాదు..రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయన్నారు. లక్ష కోట్లు అప్పు చేసి శాశ్వత నిర్మాణాలు ఎందుకు కట్టలేకపోయారని బొత్ప టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలు ఏదీ మరిచిపోరని..చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మార్పురాలేదన్నారు. రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాజధాని విషయంలో ప్రజలకు క్లారిటీ ఉందని ..లేనిది చంద్రబాబు, లోకేష్‌లకే అంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.
Next Story