మేడిన్ ఇండియా సైకిల్‌ను తొక్కిన బ్రిటన్ ప్రధాని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 July 2020 7:18 AM GMT
మేడిన్ ఇండియా సైకిల్‌ను తొక్కిన బ్రిటన్ ప్రధాని

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ మేడిన్ ఇండియా సైకిల్ ను తొక్కడం విశేషం. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఊబ‌కాయానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌న్న ఉద్దేశంతో జీబీపీ 2 బిలియ‌న్ సైక్లింగ్ అండ్ వాకింగ్ డ్రైవ్ ‌ను బోరిస్ జాన్సన్ మొదలుపెట్టారు. నాటింగ్‌హామ్‌లోని బీస్ట‌న్ వ‌ద్ద ఉన్న హెరిటేజ్ సెంట‌ర్‌లో బోరిస్ జాన్సన్ సైకిల్ తొక్కారు.

56 సంవత్సరాల జాన్సన్ కు సైకిల్ తొక్క‌డమంటే చాలా ఇష్టం. హీరో వైకింగ్ ప్రో సైకిల్ ను బోరిస్ జాన్సన్ తొక్కారు. ప్రజలు కూడా సైకిల్ తొక్కాలని.. ఊబకాయం నుండి బయటపడాలని కోరారు. దేశ వ్యాప్తంగా వేల కిలోమీట‌ర్ల బైక్ లేన్ల‌ను ఆవిష్క‌రించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. ఫిట్‌నెస్‌ను పెంచేందుకు, గాలి నాణ్య‌త‌ను పెంచేందుకు, ట్రాఫిక్ జామ్ త‌గ్గించేందుకు ఆ లైన్లు ఉపయోగపడతాయని అన్నారు. ఆరోగ్య‌, వాతావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు సైక్లింగ్ చాలా కీల‌క‌మైంద‌ని జాన్స‌న్ తెలిపారు. సైకిల్ లైన్లను ఏర్పాటు చేస్తే వేళ సంఖ్యలో ప్రజలు కూడా సైకిళ్లను ఉపయోగిస్తారని భావిస్తూ ఉన్నారు.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పిహెచ్ఇ) లో భాగంగా 'బెటర్ హెల్త్' అనే క్యాంపెయిన్ ను అధికారులు ప్రవేశపెట్టారు. హెల్తీ లైఫ్ స్టైల్ ను ప్రజలు అలవాటు చేసుకోవాలని.. ఎన్నో రోగాల బారిన పడకుండా ఉండాలంటే సైక్లింగ్ ను మొదలుపెట్టాలని వైద్యులు కూడా చెబుతున్నారు.

Next Story