'బొంబాట్' ఫ‌స్ట్‌లుక్, లోగో విడుద‌ల చేసిన పూరి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 7:59 AM GMT
బొంబాట్ ఫ‌స్ట్‌లుక్, లోగో విడుద‌ల చేసిన పూరి

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై 'ఈన‌గ‌రానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం 'బొంబాట్'. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ లోగోను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో హీరో చేతిలో ఉన్న ల‌వ్ సింబ‌ల్ ఉన్న గిఫ్ట్ ఉంది. దాన్ని హీరో దాచి పెట్టుకుంటున్నాడు. అత‌ని వైపు హీరోయిన్స్ కోపంగా చూస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ... యంగ్ బ్ల‌డ్ క‌లిసి చేసిన 'బొంబాట్' ఫ‌స్ట్ లుక్‌ను ఇప్పుడే చూశాను. చాలా బావుంది. సుశాంత్, సిమ్రాన్‌, చాందిని, మ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జోశ్య‌భ‌ట్ల నాకు మంచి స్నేహితుడు జోష్‌.బి త‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. ఈ సినిమా క‌లెక్ష‌న్స్‌తో బొంబాట్ చేయాల‌న్నారు.. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయనున్నారు. అలాగే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story
Share it