భారీ బాంబు పేలుడు

By సుభాష్  Published on  13 Jun 2020 11:57 AM GMT
భారీ బాంబు పేలుడు

పాకిస్థాన్‌ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే గారిసన్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటన స్థలానికి బాంబు స్వ్కాడ్ వచ్చి తనిఖీలు చేపట్టింది. అయితే ఇది శక్తివంతమైన పేలుడుగా చెప్పుకొచ్చారు పోలీసులు. మార్కెట్‌లోని పార్కింగ్‌ ప్రదేశంలో ఓ వాహనంలో ఈ బాంబును అమర్చినట్లు గుర్తించారు. ఇంత బాంబు పేలుడు జరిగినా..ఒకరు మినహా ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఊపిరి పిల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈ ప్రాంతంలో సైనిక ప్రధాన కార్యాలయం ఉండటంతో పాటు గూఢాచారి కార్యాలయాలు, పలువురి ఉన్నతాధికారుల నివాసాలు కూడా ఉన్నాయి. గత కొన్ని రోజుల కిందట ఇదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని సైతం దుండగులు హతమార్చారు. అయితే వారు ఉగ్రవాదులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరోసారి ఇదే ప్రాంతంలో పేలుడు చోటు చేసుకోవడం మరింత కలకలం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story